Header Banner

రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!

  Fri Mar 14, 2025 09:36        Politics

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుండగా, భాగస్వామ్య పక్షాలు సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కూటమిగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్‌ నేత, శాసనమండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా, మరికొద్ది రోజులలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఆయన భవిష్యత్తుపై తీసుకోనున్న నిర్ణయం కీలకంగా మారింది.

 

ఇది కూడా చదవండి: గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

 

యనమల తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి రానందున, తన రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగాలనే అంశంపై స్పష్టత ఇచ్చారు. తన కుమార్తె దివ్య ఇప్పటికే ఎమ్మెల్యేగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌ మైదుకూరు ఎమ్మెల్యేగా, అల్లుడు మహేష్‌ ఏలూరు ఎంపీగా కొనసాగుతుండగా, కొత్తగా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి వివరించినప్పుడు, తనకు మండలిలో ఇప్పటికే రెండు అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఇకపై ఎమ్మెల్సీగా కొనసాగేందుకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. గతంలో రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన ఉన్నా, అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో కార్పొరేట్ల హస్తక్షేపం పెరిగిపోయిందని వ్యాఖ్యానించిన ఆయన, అవకాశం ఉంటే రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమని, లేకుంటే రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు యనమల రామకృష్ణుడికి రాజ్యసభ అవకాశం కల్పిస్తారా లేదా అనేది టీడీపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #YanamalaRamakrishnudu #TDP #PoliticalFuture #RajyaSabha #MLC #Chandrababu #AndhraPradesh #TeluguDesamParty